EMI Crime: ట్రాక్టర్ EMI చెల్లించడానికి కోసం బంధువుల దారుణం..
- ట్రాక్టర్ ఫైనాన్స్ డబ్బులు చెల్లించడానికి దారుణం..
- తల్లీకూతుళ్లను హత్య చేసిన సొంత బంధువులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EMI Crime: అప్పుతో ట్రాక్టర్ కొనుగోలు చేసి EMI చెల్లించడానికి డబ్బులు లేవని సొంత బంధువులే దారుణహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన రాజస్థాన్ లోని ప్రతాప్గఢ్ జిల్లాలో జరిగింది. తల్లికూతుళ్లను సొంత బంధువులే హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. ట్రాక్టర్ ఫైనాన్స్ వాయిదాలు చెల్లించడానికి, మృతుల వద్ద ఉన్న బంగారం, వెండి ఆభరణాలను దొంగిలించేందుకు హత్యకు పాల్పడ్డారు.
మే 28న జిల్లాలోని దేవ్గడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతామాత అభయారణ్యంలోని భోపఖేడా పాల్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంకీ మీనా, ఆమె కుమార్తె కమల ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న సమయంలో ఆమె మరిది బాబులాల్ మీనా, అతడి భార్య గెండాబాయిలు కలిసి హత్య చేశారు. నిందితులు ఇంట్లోకి చొరబడి మంకీ మీనా వెండి కంకణాలు, ఇతర ఆభరణాలు, నగదును దొంగిలించారు. దొంగిలించిన ఆభరణాలను అమ్మేసి, ట్రాక్టర్ ఫైనాన్స్ కట్టేద్దామని భావించారు.
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
కేసు తీవ్రత దృష్ట్యా పోలీసులు దర్యాప్తు కోసం స్పెషల్ టీమ్లను ఏర్పాటు చేశారు. ఫోరెన్సిక్, డాగ్ స్వ్కాడ్, సైబర్ టీమ్ సహాయంతో సాంకేతిక ఆధారాలు సేకరించారు. జూన్ 11న అటవీ ప్రాంతంలో నిందితుడు దాగి ఉన్నాడనే పక్కా సమాచారంతో పోలీసులు బాబూలాల్ మీనాను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడితో పాటు భార్య గెండాబాయిని కూడా అరెస్ట్ చేశారు.
నిందితుడు బాబూలాల్ ఇటీవల ఒక సెకండ్ హ్యాండ్ సోనాలిక ట్రాక్టర్ను రూ. 2.55 లక్షలతో కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఫైనాన్స్ వాయిదాలు చెల్లించేందుకు డబ్బు లేకపోవడంతో మంకీ మీనా వద్ద బంగారం, వెండి ఆభరణాలు దోచుకోవాలని ప్లాన్ చేసి హత్య చేసినట్లు విచారణలో తేలింది. నేరం చేసిన తర్వాత కూడా ఇద్దరు నిందితులు మృతుల వద్ద దు:ఖిస్తూ నటించారు. హత్యకు ఉపయోగించిన గొడ్డలి, కత్తి, ఇతర వస్తువుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..