సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చాలా ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకుంటారు. దాని పరిణామాలు షాకింగ్‌గా ఉంటాయి. ఫిలిప్పీన్స్‌లోని ఓ యువకుడు చేసిన పనికి అందరూ తిట్టి పోస్తున్నారు. సూపర్ గ్లూ ( ఫెవిక్విక్ లాంటి పదార్థం)ను పెదాలపై వేసుకున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ చర్యతో ఆ యువకుడిని ఇబ్బందుల్లోకి నెట్టడమే కాకుండా సోషల్ మీడియాలో విభిన్న కామెంట్లు వస్తున్నాయి.