Super Visa: కెనడాలో ఉంటున్న భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పింది అక్కడి ప్రభుత్వం. కెనడాలో ఉంటున్న వారు ఇకపై తమ తల్లిదండ్రులతో ఎక్కువ రోజులు గడిపేలా అక్కడి ప్రభుత్వం సూపర్ వీసా నిబంధనల్లో మార్పులు చేసింది. ఇమ్మిగ్రేషన్, శరణార్థుల పౌరసత్వ మంత్రిత్వ శాఖ, ప్రజా భద్రత మంత్రిత్వ శాఖల ఆదేశాల మేరకు కొత్త నిబంధనలు ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి అమలులోకి వచ్చాయి.