యంగ్ టైగర్ ఎన్టీయార్ దేవర ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైలో ఓ ఈవెంట్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తారక్ తమిళ స్ట్రయిట్ సినిమా పై యాంకర్ ప్రశించగా తారక్ మాట్లాడుతూ ‘ వెట్రిమారన్ త్వరగా నాతో సినిమా చేస్తే తెలుగులో డబ్బింగ్ చేసుకుంటాను’ అని అన్నాడు. వాస్తవానికి వెట్రిమారన్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎప్పుడో నటించాల్సి ఉంది. తారక్ కు కథ వినిపించడం కూడా జరిగింది. కాని ఈ చిత్రం పట్టాలెక్కలేదు.…