NASA: బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్ క్యాప్సూల్ ద్వారా ఇటీవల సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లారు. అయితే, అనూహ్యంగా స్టార్‌లైనర్‌లో లీకులు ఏర్పడటంతో ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోనే చిక్కుకుపోయారు. ఆమె వచ్చే అవకాశం ఇప్పట్లో కనిపించడం లేదు. ఆమె అంతరిక్షంలోనే మరో ఆరు నెలల పాటు ఉంటుందని ఇటీవల నాసా ప్రకటించింది.
Sunita Williams : సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను అంతరిక్షం నుండి తిరిగి తీసుకురావడంలో విఫలమైన స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకను తయారు చేసిన బోయింగ్ సంస్థకు శుభవార్త వచ్చింది.
బోయింగ్ విమానంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) చేరుకున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఈ సంవత్సరం తిరిగి రాలేరు. ఈ ఏడాది వ్యోమగాములు తిరిగి రావడం సాధ్యం కాదని నాసా శనివారం (ఆగస్టు 24) తెలిపింది.
Sunita Williams: అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్ ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్)కి వెళ్లిన సునితా విలియమ్స్ మరో 6 నెలల పాటు అక్కడే ఉండబోతున్నట్లు నాసా చెప్పింది. సునితా విలియమ్స్ జూన్ 5న ఫ్లోరిడా నుంచి స్టార్‌లైనర్ స్పేస్ క్యాప్సూల్‌లో అంతరిక్షంలోకి వెళ్లింది.
Sunita Williums : సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతరిక్షం నుండి తిరిగి ఎప్పుడు వస్తారని చూసే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే నాసా ఇచ్చిన సమాచారం పెద్ద షాక్ కలిగించింది.
Sunita Williams Plants trees at Universe : నాసా యోమగామి సునీతా విలియమ్స్ బోయింగ్ స్టార్ లైనర్ మిషన్ కింద తన భాగస్వామి బుచ్ విల్మోర్ తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లారు. ఇకపోతే తాజాగా విలియమ్స్ అంతరిక్షంలో మట్టి లేకుండా మొక్కలను పెంచడంలో విల్మోర్ తో కలిసి పని చేస్తున్నట్లు కనపడుతుంది. మైక్రోగ్రావిటీలో మొక్కలకు నీరు పెట్టే మార్గాలను పరీక్షిస్తూ ఆమె సమయాన్ని గడిపింది. విలియమ్స్ ప్లాంట్ వాటర్ మేనేజ్మెంట్ హార్డ్‌వేర్‌ను…
బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న భారతీయురాలు సునీతా విలియమ్స్ ఇంకా కొంత కాలం పాటు అక్కడే ఉండాల్సి రావచ్చు. ఈ మిషన్ ను రూపొందించినప్పుడు తక్కువ రోజులే ఉంటుందని వెల్లడించారు.
భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సిబ్బంది బుచ్ విల్మోర్‌తో కూడిన బోయింగ్ స్టార్‌లైనర్ గురువారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) సురక్షితంగా చేరుకుంది. 59 ఏళ్ల వ్యోమగామి తన తొలి మిషన్‌లో అనుభవం లేని నూతన సిబ్బందితో అంతరిక్ష నౌకను ఎగుర వేసి పరీక్షించిన మొదటి మహిళగా రికార్డు సృష్టించారు.
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ మూడో అంతరిక్ష యాత్ర ప్రస్తుతానికి వాయిదా పడింది. అయితే, కొత్త లాంచ్ తేదీ ఏమిటో ఇంకా స్పష్టంగా తెలియలేదు. సాంకేతిక లోపం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇద్దరు వ్యోమగాములు బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్‌షిప్‌లో నేడు స్పేస్‌లోకి దూసుకెళ్లనున్నారు.