గత మూడేళ్లుగా బాక్సాఫీస్ వద్ద వేసవి సందడి ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు, ఈ ఏడాదైనా స్టార్ హీరోల సినిమాలతో థియేటర్లు కళకళలాడుతాయని సినీ ప్రియులు ఆశపడ్డారు కానీ, తాజా పరిణామాలు చూస్తుంటే ఈ సమ్మర్ కూడా వెలవెలబోయేలా కనిపిస్తోంది. మండు వేసవిలో రావాల్సిన భారీ చిత్రాలు షూటింగ్ వాయిదాల వల్ల వర్షాలు పడే వరకు వెనక్కి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. మార్చి నెలాఖరు నుండి మొదలవ్వాల్సిన సందడిపై ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నాయి, మార్చి 26న నాని…