వంశీ, అనిల్, కృష్ణప్రియ హీరోహీరోయిన్లుగా తెరకెక్కబోతున్న సినిమా ‘సుగ్రీవ’. మధుసూదన్ రెడ్డి, ఏడుకొండలు రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కొత్తపల్లి నగేశ్ దర్శకుడు. ఈ సినిమా ప్రారంభోత్సవం శుక్రవారం రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి రచయిత, దర్శకుడు బి.వి.ఎస్. రవి క్లాప్ ఇవ్వగా, నటుడు మహేశ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మధుసూదన్ రెడ్డి, ఏడుకొండలు రెడ్డి మాట్లాడుతూ ”దర్శకుడు కొత్తపల్లి నగేష్ ఇదివరకే చాలా సినిమాలకు దర్శకత్వం వహించారు.…