ఏడేళ్ళ క్రితం అభిషేక్ నామా నిర్మాతగా పలు ప్రాజెక్ట్స్ ప్రకటించారు. అందులో ఐదు సినిమాలు విడుదల కాగా 'గూఢచారి' మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. అవే కాకుండా మరో ఏడు సినిమాలను వచ్చే యేడాది ప్రారంభిస్తానని అభిషేక్ నామా చెబుతున్నారు.