తమిళ చిత్రసీమలో విషాదం నెలకొంది. ప్రముఖ స్టంట్ మాస్టర్ ఎస్.ఎమ్.రాజు సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందారు. హీరో ఆర్య ప్రధాన పాత్రలో, పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో స్టంట్ కో-ఆర్డినేటర్‌గా పని చేస్తున్న రాజు, ఇటీవల జరిగిన షెడ్యూల్‌లో కార్ జంప్ స్టంట్‌లో పాల్గొంటుండగా అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. తీవ్ర గాయాల కారణంగా ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ సంఘటన సినీ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని మిగిలించింది. Also Read…