తెలంగాణలో టీచర్ల ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. గురువారం రాత్రి తెలంగాణ సర్కారు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో టెట్ పరీక్ష దరఖాస్తులు స్వీకరిస్తామని విద్యాశాఖ తెలిపింది. జూన్ 12న టెట్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. అభ్యర్థులు నోటిఫికేషన్ కాపీని ఈ నెల 25 నుంచి tstet.cgg.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది.…
ఏపీలో ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 7 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ ఏడాది జంబ్లింగ్ విధానం లేకుండా పరీక్షలు జరపనున్నట్లు పేర్కొంది. సెకండియర్ విద్యార్థులంతా రేపటి నుంచి తమ హాల్ టికెట్లను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ bie.ap.gov.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందిగా సూచించింది. కాగా ప్రాక్టికల్స్ పరీక్షలకు జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు గురువారం…
సీబీఎస్‌ఈ టర్మ్ 2 పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు 10, 12 తరగతులకు సంబంధించి బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను సీబీఎస్‌ఈ విడుదల చేసింది. పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి ప్రారంభం అవుతాయని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది. అలాగే మే 24న ఈ పరీక్షలు ముగుస్తాయని షెడ్యూల్‌లో స్పష్టం చేసింది. 12వ తరగతి పరీక్షలు కూడా ఏప్రిల్ 26న ప్రారంభం అవుతాయని.. ఈ పరీక్షలు జూన్ 15న పూర్తవుతాయని తెలిపింది. ఈ…
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 21న జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు మార్చాల్సి ఉంది. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 22 నుంచి మే 11 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు, ఏప్రిల్ 23 నుంచి మే 12 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. అటు మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు..…
తెలంగాణలో టెన్త్ పరీక్షలకు సమయం దగ్గర పడుతోంది. మే 11 నుంచి పరీక్షలు జరగనున్నాయి. అయితే పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసిన నాటి నుంచి విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే కరోనా వల్ల ఈ ఏడాది కూడా అంతంత మాత్రమే క్లాసులు జరిగాయ్. దీంతో విద్యార్థులను పరీక్షలకు ఎలా సన్నద్ధం చేయాలో అధికారులకు పాలుపోవడం లేదు. అటు పరీక్షలు ఎలా రాయాలో తెలియక విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. తెలంగాణలో చివరిగా టెన్త్ పరీక్షలు 2018-2019…
తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ విద్యార్థులకు వార్షిక పరీక్షల్లో ప్రశ్నల ఛాయిస్‌ను రెట్టింపు చేయాలని నిర్ణయించింది. ప్రశ్నల సంఖ్యను కూడా గణనీయంగా పెంచింది. గతంలో కొన్ని సెక్షన్లలో మాత్రమే ఛాయిస్ ప్రశ్నలు ఇవ్వగా, ఈ ఏడాది అన్ని సెక్షన్లలో ప్రశ్నల సంఖ్యను పెంచి, ఛాయిస్‌గా వదిలేసుకొనే అవకాశం కల్పించింది. 2021-22 సంవత్సరానికి తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియాల మాదిరి ప్రశ్నపత్రాలను ఇంటర్ బోర్డు అధికారులు వెబ్‌సైట్‌లో పెట్టారు. గత ఏడాది మూడు సెక్షన్లకు…