సోడాలు, వివిధ రకాల కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల గుండె సమస్యలు, స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే.. ఇవే కాకుండా, పండ్ల రసాల వల్ల కూడా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. యూనివర్శిటీ ఆఫ్ గాల్వే, మెక్‌మాస్టర్ యూనివర్శిటీ, కెనడా నిపుణులు, అంతర్జాతీయ స్ట్రోక్ నిపుణుల బృందం చేసిన తాజా పరిశోధనలో ఇది వెల్లడైంది.
గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా మరణానికి ప్రధాన కారణమవుతున్నాయి. ప్రతి సంవత్సరం మిలియన్ల మంది ప్రజలు మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా యువకులలో స్ట్రోక్ కూడా పెరుగుతోందని పరిశోధకులు కనుగొన్నారు. స్ట్రోక్‌ని బ్రెయిన్ స్ట్రోక్ అని కూడా అంటారు. మెదడులోని కొంత భాగానికి రక్త సరఫరా లేనప్పుడు లేదా మెదడులోని రక్త నాళాలు కొన్ని కారణాల వల్ల పగిలినప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది.
పక్షవాతం అనేది ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రజలను ప్రభావితం చేసే ఒక రోగం. దీని వల్ల కండరాల పనితీరు, చలనశీలతను కోల్పోతుంది శరీరం. బాధాకరమైన గాయాల నుండి వైద్య పరిస్థితుల వరకు పక్షవాతానికి వివిధ కారణాలు ఉన్నాయి. అవి శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఒకసారి చూద్దాం. 1. వెన్నెముక దెబ్బలు: పక్షవాతానికి అత్యంత సాధారణ కారణాలలో ఒకటి వెన్నుపాము గాయం. కారు ప్రమాదం లేదా పడిపోవడం వంటి గాయం కారణంగా వెన్నెముక దెబ్బతిన్నప్పుడు, అది గాయం…
Stroke: వాయుకాలుష్యం, స్రోక్ మధ్య సంబంధాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా స్వల్పకాలిక వాయు కాలుష్యానికి గురికావడం వల్ల కూడా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని ఒక అధ్యయనం తెలిపింది. న్యూరాలజీ జర్నల్ లో ఈ పరిశోధన వివరాలను ప్రచురించారు. స్వల్పకాలికంగా వాయుకాలుష్యానికి గురైన ఐదు రోజుల వ్యవధిలోనే స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని తేల్చింది.
ఈ మధ్య కాలంలో హార్ట్ ఎటాక్‌తో మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అది కూడా నిండా నలబై ఏళ్లు నిండని వారు కూడా హార్ట్ ఎటాక్‌తో మరణిస్తున్నారు. మూడు, నాలుగు రోజుల క్రితం మరణించిన తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయిచంద్ 39 ఏళ్లకే హార్ట్ ఎటాక్‌తో మరణించాడు.