ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజాలో ఓ విచిత్రమైన, బాధాకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ వ్యక్తి తంత్ర మంత్రానికి బలై.. బతికి ఉన్న కోడిపిల్లను మింగేశాడు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చనిపోయాడు. తొలుత గుండెపోటుతో యువకుడు మృతి చెంది ఉంటాడని వైద్యులు భావించారు. అయితే పోస్ట్‌మార్టం చేయగా గొంతులో చనిపోయిన కోడిపిల్ల కనిపించింది.
Warangal: విగ్రహానికి పాలు తాగడం..శివుడిని పూజిస్తున్న పాము..ఆవు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం..ఆంజనేయుడు కళ్లు తెరవడం.. గణపతి కొబ్బరిరూపంలో ఉండటం..రాముడు కన్నీరు కారుస్తున్నట్లు ఉండటం ఇలాంటి విచిత్రమైన సంఘటనలు మనం చూస్తున్నాం.. వింటున్నాం. చాలా మంది భగవంతుడికి మహిమ ఉందని బలంగా నమ్ముతారు. ఇలాంటి సంఘటనలు వారి నమ్మకాలను నిజం చేస్తున్నాయి. దేవుళ్లనే కాదు ప్రకృతిలోని జంతువులను, పక్షులను కూడా ఎంతో భక్తిశ్రద్ధలతో కొలిచే సంప్రదాయం భారతీయులది. అందుకే రాతిలో కూడా దేవుని ప్రతిమను పూజిస్తారు. Read…
దేశంలో ఎన్నో వింతలను చూస్తూనే ఉంటాం.. వినాయకుడు పాలు తాగాడు.. వేప చెట్టుకు పాలు వస్తున్నాయి.. సాయి బాబా ఆహారం తిన్నాడు.. ఇవన్నీ వింతలే.. అందులో నిజమెంత అనేది పక్కన పెడితే.. ఆ వింతను చూడడానికి మాత్రం భక్తులు భారీసంఖ్యలో హాజరవుతున్నారు. ఇక తాజాగా ప్రకాశం జిల్లాలో శ్రీరాముడు కంట కన్నీరు రావడం అనేది వింతగా మారింది. శ్రీరాముడి విగ్రహం నుంచి నీరు ధారాళంగా కారడంతో భక్తులు భయపడిపోతున్నారు. రాములవారిని చూడడానికి వేలసంఖ్యలో హాజరవుతున్నారు. వివరాలలోకి వెళితే..…