హష్ మనీ కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా అడల్ట్ ఫిల్మ్ స్టార్ స్టార్మీ డేనియల్స్ వాంగ్మూలం ఇచ్చారు. డేనియల్స్ మంగళవారం కోర్టుకు హాజరై, 2006లో అమెరికాలోని లేక్ తాహోలోని హోటల్‌లో ట్రంప్‌తో సెక్స్‌లో పాల్గొన్నారని, ఆమె అందుకున్న చెల్లింపు గురించి చెప్పారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై వేసిన పరువునష్టం కేసులో పోర్న్ స్టార్ డేనియల్స్‌కు చుక్కెదురయ్యింది. కోర్టు ఫీజు భాగంగా ట్రంప్ తరఫు న్యాయవాదులకు లక్షా 20వేల డాలర్లు చెల్లించాలని కాలిఫోర్నియా కోర్టు ఆదేశించింది.
Donald Trump: అమెరికాలో ఎప్పుడూ జరగని విధంగా ఓ మాజీ అధ్యక్షుడు అరెస్ట్ అయ్యారు. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్‌తో సంబంధాన్ని దాచిపెట్టి ఉంచేందుకు ఆర్థికంగా ప్రలోభపెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ హుష్ మనీ కేసులో పోలీసులు ట్రంపును అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం న్యూయార్క్ లో ని మాన్ హటన్ లోని కోర్టులో హాజరయ్యారు ట్రంప్. ఆయనపై మొత్తం 34 అభియోగాలను నమోదు అయ్యాయి. అయితే తాను దోషిని కానని ట్రంప్ కోర్టు ముందు తెలిపారు.
Donald Trump: పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ ఆరోపణలు, లైంగిక వేధింపులు ఇలా పలు అభియోగాల్లో ఇరుక్కున్నారు మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అక్కడి న్యాయమూర్తులు ట్రంపును విచారించేందుకు సిద్ధం అవుతున్నారు. ఆయన అరెస్టు జరుగుతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. 2016 ఎన్నికల ముందు తనతో సెక్స్ చేసిన విషయాన్ని దాచేందుకు 1,30,000 డాలర్లను ఇచ్చినట్లు స్టార్మీ డేనియల్స్ ఆరోపిస్తోంది. మాన్ హటన్ అటార్నీ, గ్రాండ్ జ్యూరీ విచారణకు అనుమతించిన 24 గంటల్లోనే ట్రంప్ పై…
Stormy Daniels: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి రిపబ్లికన్ల తరుపున పోటీ చేద్ధాం అని భావిస్తున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఓ శృంగార తార చేసిన ఆరోపణలు ఆయన్ను జైలు పాలయ్యేలా చేస్తున్నాయి. ఈ పోర్న్ స్టార్ పేరే స్టార్మీ డేనియల్స్. 2016 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు ట్రంప్ తో శృంగారం గురించి చెప్పకుండా ఉండేందుకు ఆమెకు 1,30,000 డాలర్లను అందించినట్లు స్టార్మీ డేనియల్స్ ప్రకటించడం అమెరికాను ఓ కుదుపుకుదిపేసింది.…