Today Stock Market Roundup 21-03-23: ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ఇవాళ మంగళవారం మంచి జోష్ కనిపించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ట్రేడింగ్ పాజిటివ్‌గానే నడిచింది. పాశ్చాత్య దేశాల్లో బ్యాంకింగ్ సంక్షోభానికి సంబంధించిన భయాలు తగ్గుముఖం పట్టడం మన మార్కెట్‌కి కలిసొచ్చింది. దీంతో ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు భారీ లాభాలను ఆర్జించాయి. సెన్సెక్స్ మళ్లీ 58 వేల పాయింట్లు దాటింది. చివరికి.. 445 పాయింట్లు పెరిగి 58 వేల 74 పాయింట్ల వద్ద ముగిసింది.