Multibagger Stocks: చిన్న, మధ్య తరహా షేర్లు తక్కువ కాలంలోనే భారీ లాభాలను ఆర్జించాయి. ఐదేళ్ల లోపు ఈ మల్టీబ్యాగర్ స్టాక్ 11 వేలకు పైగా వృద్ధిని నమోదు చేసింది. ఆథమ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఆథమ్) దాని వాటాదారులకు ఆశ్చర్యకరమైన రాబడిని అందించినటువంటి స్టాక్. కోవిడ్ సమయంలో ఇది రూ. 3.83గా ఉంది. ఇప్పుడు అది 11832 శాతం పెరిగి ఒక్కో షేరుకు రూ.457 వద్ద ట్రేడవుతోంది.
Read Also:Tiger Shroff: అన్నా నువ్వు అసలు నేలపై నిలబడే సినిమాలు చేయవా? టీజర్ అంతా గాల్లోనే ఉన్నావ్?
మూడేళ్లలో ఈ స్టాక్ రూ.లక్ష పెట్టుబడిని రూ.1.19 కోట్లకు పైగా మార్చింది. ఫిబ్రవరి 2023లో ఈ స్టాక్ రూ. 154.5 వద్ద ఉంది. ఇక్కడ నుంచి 196 శాతం వృద్ధి నమోదైంది. గత నెల ఆగస్టు 8, 2023న ఈ స్టాక్ దాని రికార్డు గరిష్ట స్థాయి రూ.580ని కూడా తాకింది. అయితే గరిష్ఠ స్థాయికి చేరుకున్న తర్వాత స్వల్పంగా బలహీనపడి 21 శాతానికి పైగా క్షీణతను నమోదు చేసుకుంది. స్టాక్ మూడు సంవత్సరాలలో 4032 శాతం లాభపడింది. అయితే ఇది గత 1 సంవత్సరంలో 98 శాతం, 2023లో 103 శాతం పెరుగుదలను నమోదు చేసింది.
Read Also: Nara Lokesh: మరో రెండు కేసుల్లో నారా లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్లు!
Authum అనేది నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ. ఇది భారతదేశంలో అనేక పెట్టుబడి, ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొంటుంది. కంపెనీ షేర్లు, రియల్ ఎస్టేట్‌లలో పెట్టుబడి పెడుతుంది. ఈక్విటీ, స్టాక్ మార్కెట్‌లలో వ్యాపారం చేస్తుంది.