Unemployment In India: ప్రజల పొదుపు 50 ఏళ్లలో కనిష్ట స్థాయికి చేరుకుందని, ప్రజలపై అప్పుల భారం పెరుగుతోందని ఆర్‌బీఐ నివేదికలో పేర్కొంది. ఇప్పుడు దేశంలో నిరుద్యోగం గురించి ఆందోళన కలిగించే నివేదిక మరొకటి బయటకు వచ్చింది. దేశంలోని 25 ఏళ్లలోపు యువ గ్రాడ్యుయేట్లలో 42.3 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు.