Harish Rao : తెలంగాణ రాష్ట్రానికి గత పదేళ్లలో సాధించిన అభివృద్ధిని ఒక్క సంవత్సరంలోనే వెనక్కి నెట్టి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన దెబ్బ కొట్టారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయంలో గణనీయమైన తగ్గుదల నేపథ్యంలో, ట్విటర్ వేదికగా ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. హరీష్ రావు పేర్కొన్న వివరాల ప్రకారం, బీఆర్ఎస్ పాలనలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతి సంవత్సరం సగటున 25.62 శాతం…
తెలంగాణలో రిజిస్ట్రేషన్ ధరలు వినియోగదారులను ఠారెత్తిస్తున్నాయి. ఛార్జీలు భారీగా పెరగడంతో రిజిస్ట్రేషన్లు భారంగా మారాయి. రాష్ట్రంలో వ్యవసాయ భూముల మార్కెట్ విలువలు 50 శాతం, ఖాళీ స్థలాలవి 35 శాతం, అపార్ట్‌మెంట్ ఫ్లాట్ల విలువను 25-30 శాతం పెంచింది స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ. దీంతో రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గాయి. జనవరి 31 అర్థరాత్రి వరకూ భారీగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. గతంలో ఉన్న మార్కెట్ విలువలకు, ప్రతిపాదించిన విలువల మధ్య సరాసరి వ్యత్యాసం 35-40 శాతం పైగానే ఉంది.…