ఒక సినిమా అనౌన్స్మెంట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూడడం బహుశా ఇదే మొదటిసారేమో. ఒక్క తెలుగు ఆడియెన్స్ మాత్రమే కాదు యావత్ ప్రపంచం మొత్తం మహేష్ బాబు, రాజమౌళి ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తోంది. కానీ ఎలాంటి హడావిడి లేకుండానే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కానిచ్చేశాడు జక్కన్న. మామూలుగా అయితే రాజమౌళి సినిమా ఓపెనింగ్ రోజు ప్రెస్ మీట్ ఉంటుంది. కానీ ఈసారి అలాంటిదేమి లేదు. సడెన్‌గా సైలెంట్‌గా రాజమౌళి ముహూర్తం పెట్టేశాడు.…