రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా విజయనరంలో విస్తృత పర్యటన అనంతరం చర్యలు మొదలయ్యాయి. శృంగవరపుకోట సబ్ రిజిస్ట్రార్ ని సస్పెండ్ చేశారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట.. ఎస్.కోట సబ్ రిజిస్ట్రార్ శ్యామలను సస్పెండ్ చేస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ విజయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.
OFF The Record: ఇద్దరూ అధికారపార్టీ ప్రజాప్రతినిధులే. ఒకరు ఎమ్మెల్యే .. ఇంకొకరు ఎమ్మెల్సీ. మొన్నటి వరకు కలిసిమెలిసి సాగిన నాయకులే. ఉన్నట్టుండి ఇద్దరి మధ్య అగ్గి రేగింది. పరస్పరం ఫిర్యాదులు చేసుకునేంతగా విభేదాలు వచ్చాయి. పార్టీ కోసం కలసి సాగాల్సిన నేతలు.. ఎందుకు కొట్టుకుంటున్నారు? ఎవరా నాయకులు? శృంగవరపుకోటలో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం. సిట్టింగ్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు. ఇదే నియోజకవర్గానికి చెందిన రఘురాజు ఎమ్మెల్సీ. ఇద్దరూ వైసీపీ నేతలే.…