శ్రీశైలం జలాశయం.. ఉభయ తెలుగు రాష్ట్రాలకు సాగునీరు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తిలో చాలా కీలకం. జల విద్యుత్ ఉత్పత్తిలో శ్రీశైలం జలాశయందే సింహభాగం. సుమారు 25 లక్షల ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు అందిస్తున్న బహుళార్తక సాధక ప్రాజెక్టు శ్రీశైలం. ఇంతటి ప్రాధాన్యత ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు 2009లో ప్రమాదంలో పడింది.