నేటి నుంచి యాదాద్రిలో మూడు రోజులపాటు లక్ష్మీ నరసింహస్వామి జయంత్యుత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో గీత తెలిపారు. అనుబంధ పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానంతోపాటు దబ్బగుంటపల్లిలోని యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. సంభోద్భవుడైన నరసింహస్వామి జయంత్యుత్సవాలకు శుభఘడియాలు వచ్చేస్తున్నాయి. ఈ సంబరం నిర్వహణకు ఆచార్య బృందం.. ఆలయ యంత్రాంగం సంసిద్ధమైందని తెలిపారు. పునర్ నిర్మితమైన పంచనారసింహుల దివ్యాలయంలో నారసింహుడి జయంత్యుత్సవాలు శుక్రవారం ఉదయం 9.30 గంటలకు విష్వక్సేన ఆరాధనతో మొదలవుతాయని ఈవో గీత,…