చిత్రసీమలోకి అడుగుపెట్టిన ప్రతి రైటర్… ఎప్పుడో ఒకప్పుడు డైరెక్టర్ కావాలని కలలు కంటూ ఉంటాడు. అయితే కొందరి కలలు త్వరగా నెరవేరితే మరికొందరి కలలు నిజం కావడానికి చాలా కాలం పడుతుంది. పలు విజయవంతమైన చిత్రాలకు రచన చేసిన శ్రీధర్ సీపాన పరిస్థతి కూడా అదే. దాదాపు మూడు, నాలుగేళ్ళుగా దర్శకుడు కావాలనుకుంటున్న అతని కోరిక తీరకుండా వాయిదా పడుతూ వచ్చింది. ‘బృందావనమది అందరిదీ’తో దర్శకుడు కావాలని శ్రీధర్ అనుకున్నాడు. కానీ ఆ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు.…