హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ సమీపంలోని గురుమూర్తి నాగర్‌లోని శ్రీ వినాయక దేవాలయంలో విగ్రహాలు చోరీకి గురైన విషయం తెలిసిందే. ఈ విగ్రహాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. అక్కచెల్లెలు స్వర్ణలత, పావని శివపార్వతుల విగ్రహాలు దొంగతనం చేశారు. కుటుంబంలో తరచూ ఒకరు చని పోతుండటంతో విగ్రహాన్ని ప్రతిష్టించాలని బాబా చెప్పారు. బాబా మాటలు విని దేవుడు విగ్రహాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. విగ్రహాలు కొనేందుకు డబ్బులు సరిపోకపోవడంతో గుడిలో విగ్రహాలు కాజేసేందుకు స్కెచ్ వేశారు. ఎస్ఆర్ నగర్లో…
తెలుగు రాష్ట్రాల్లో చిట్టీల పేరుతో మోసాలు పెరిగిపోతున్నాయి. ఇంటి దగ్గర ఉండే అమాయక మహిళలను చిట్టీల పేరుతో బుట్టలో వేసుకుని ఆ తర్వాత చల్లగా ఉడాయిస్తున్నారు చీటర్లు. చిట్టిల పేరుతో కుచ్చుటోపి పెట్టిన మరో కేటుగాడి కేసు వెలుగులోకి వచ్చింది. కోట్ల రూపాయల మేర నట్టేట ముంచినట్లు తెలిసింది. హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌నగర్ సీ టైప్ కాలనీలో నివాసం ఉంటున్న పుల్లయ్య ఈ మోసానికి పాల్పడ్డాడు.
తెలంగాణలో వైఎస్ షర్మిల అరెస్ట్, ఆందోళనలపై స్పందించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయనకు.. షర్మిల్ అరెస్ట్‌పై ప్రశ్నలు ఎదురయ్యాయి.. ఆయన స్పందిస్తూ.. షర్మిల అరెస్ట్ బాధాకరం అన్నారు.. మా నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి ఆమె.. ఆమె పట్ల తెలంగాణలో జరిగిన ఘటన మాకు వ్యక్తిగతంగా బాధకలిగించిందన్నారు.. అయితే, ఆమె పార్టీ విధానాలకు సంబంధించి మీరు ప్రశ్నించటం.. మేం మాట్లాడటం…
నేడు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ జరిగే ఈ కార్యక్రమం కోసం సర్వాంగ సుందరంగా మండపాన్ని తీర్చిదిద్దారు. కాగా.. బోనం కాంప్లెక్స్‌ను పరిశుభ్రం చేస్తున్నారు. అమ్మవారి ఆలయం వద్ద ప్రధాన రహదారిపై ఏర్పాటుచేసిన కల్యాణ మండపం ఎదుట, వెనుక రోడ్లను బ్లాక్ చేసి క్యూలు, బారికేడ్లు ఏర్పాటుచేశారు. నిన్న సోమవారం నుంచే భక్తుల రాక మొదలైంది. దీంతో.. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా.. భారీగా వర్షం కురిసినా భక్తులు తడవకుండా ఉండేందుకు షామియానాలు, చలువ…
హైదరాబాద్ నగరంలోని సంజీవరెడ్డి నగర్లో విషాదం నెలకొంది. ఓ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. కడప జిల్లా బద్వేల్ కి చెందిన రాజ్ కుమార్ నగరంలో కార్డియాలజిస్ట్ గా పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా ఆయన వివిధ మానసిక వత్తిళ్ళతో బాధపడుతున్నారు. తాజాగా సెలెన్లో విషం ఎక్కించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మానసిక పరంగా ఇబ్బందులు పడుతున్నందునే డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడి వుండవచ్చని భావిస్తున్నారు. దీంతో పాటు మరే కారణాలు ఏవైనా వున్నాయా అనే కోణంలో ఎస్సార్ నగర్…