తెలంగాణలో కేసీఆర్ పాలనపై మండిపడ్డారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. ఖాళీగా వున్ర పోస్టు లను భర్తీ చేయకుండా బదిలీల చేయడమేమిటని అన్నారు. మూడున్నర లక్షల ఉద్యోగ వ్యవస్థ ను అగమ్యగోచరంగా తయారు చేశారు. స్థానికత ను ప్రధానంగా తీసుకోకుండా బదిలీలు చేశారన్నారు. స్థానికత కోసమే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగిన విషయాన్ని ప్రభుత్వం మర్చిపోయింది. ఉద్యోగం చేస్తున్న భార్య కేసులను కూడా పట్టించుకోక పోవడం దారుణం. అనారోగ్యం ఉన్న వారిని పట్టించుకోకుండా బదిలీలు చేశారు.…