Nigeria: నైజీరియాలో తాజాగా ఓ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఓగున్ రాష్ట్రంలోని జాతీయ క్రీడలను ముగించుకుని తిరిగివస్తుండగా జరిగిన రోడ్డుప్రమాదంలో 21 మంది క్రీడాకారులు, అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నైజీరియా క్రీడా ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. ఈ దుర్ఘటన శనివారం చోటు చేసుకుంది. ప్రమాదం కానోకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దకాసోయే పట్టణం వద్ద జరిగింది. ఓగున్ రాష్ట్ర రాజధాని అబేఒకుటా నుంచి ప్రయాణిస్తున్న కోస్టల్ బస్సు రాత్రంతా ప్రయాణించి…