ఉదయం 10 గంటలకు కొత్త ఓటర్లతో ప్రధాని మోడీ వర్చువల్ గా సంభాషించనున్నారు. బేగంపేట ఉమెన్స్ కాలేజీలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తిరుమలలో ఈరోజు రామకృష్ణ తీర్ద ముక్కోటి జరగనుంది. ఉదయం 5 గంటల నుంచి మధ్యహ్నం 12 గంటల వరకు భక్తులను టీటీడీ అనుమతించనుంది. ఉదయం 7:30 గంటలకు శ్రీవారి ఆలయం నుండి రామకృష్ణ తీర్దానికి అర్చక బృందం వెళుతుంది. గోగర్భం డ్యాం నుంచి భక్తుల తరలింపుకి ఆర్టీసీ బస్సులను…
లారీని ఢీకొన్న టీఎస్ఆర్టీసీ బస్సు: నెల్లూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. టీఎస్ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా మరొకరు మృతి చెందగా.. 10 మందికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని కావలి ఆస్పత్రికి తరలించారు. గుడ్లూరు మండలం మోచర్ల వద్ద జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండగా…
ఫిబ్రవరి 17న వైఎస్ షర్మిల కుమారుడి వివాహం: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. అనిల్ కుమార్, వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజా రెడ్డి 2024 ఫిబ్రవరి 17న పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఈ విషయాన్ని వైఎస్ షర్మిల సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించారు. అట్లూరి ప్రియాతో రాజా రెడ్డికి వివాహం జరగనున్నట్లు వైఎస్ షర్మిల తెలిపారు. రాజా రెడ్డి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే…
మంత్రి విడుదల రజిని కార్యాలయంపై రాళ్ల దాడి: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గుంటూరులో ఆదివారం అర్థరాత్రి ఉద్రిక్తత నెలకొంది. విద్యానగర్లోని ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని నూతన పార్టీ ఆఫీస్పై టీడీపీ-జనసేన కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. దీంతో కార్యాలయ అద్దాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి.. గుంపును చెదరగొట్టారు. కొంతమంది టీడీపీ-జనసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మంత్రి విడుదల రజిని కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఉంది.…