తెరుచుకున్న ఏపీఎండీసీ కార్యాలయం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ), మైనింగ్ డైరెక్టర్ కార్యాలయాలు తెరుచుకున్నాయి. మైనింగ్ శాఖ ఇంఛార్జి బాధ్యతలను సోమవారం యువరాజ్ చేపట్టగా.. ఈ రోజు రెండు కార్యాలయాలు తెరవటానికి అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే మైనింగ్ డైరెక్టర్ కార్యాలయం ఓపెన్ చేయగా.. ఉద్యోగులు విధుల్లో చేరారు. మరోవైపు ఏపీఎండీసీ కార్యాలయం కొద్దిసేపట్లో ఓపెన్ కానుంది. విధుల్లో చేరేందుకు ఉద్యోగులు కార్యాలయం ముందు ఎదురు చూస్తున్నారు. జూన్ 9న ఏపీఎండీసీ, మైనింగ్ డైరెక్టర్ కార్యాలయాలను…
రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం: ఏపీ, యానాంలో నైరుతి దిశగా బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం (జూన్ 26) బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంటున్నారు. ఈ అల్పపీడనం బలపడుతూ.. ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. అదే రోజున అల్పపీడనం ఏపీ తీరాన్ని తాకనుంది. ఈ అల్పపీడనం ప్రభావంతో బుధవారం సాయంత్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురవన్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ముసురు వాతావరణం ఏర్పడనుంది.…
నేటి నుంచి రెండు రోజుల పాటు సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12.30కు సీఎం పర్యటన మొదలవనుండగా.. సాయంత్రం 4.35కు ముగుస్తుంది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిలు ఈరోజు విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండవ రోజు జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగనుంది. సోమవారం మధ్యాహ్నం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో చర్చలు అసంపూర్ణం అవ్వడం…
గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన పలు కామెంట్స్ చేసాడు.
తిరుమలలో భక్తుల రద్దీ శనివారం నాడు మరింత పెరిగింది. ముఖ్యంగా వారాంతం కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు రాక భారీగా ఉంది. ఇక శనివారం నాడు తిరుమల లోని వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లో కంపార్టుమెంట్లలన్ని నిండిపోయి వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉన్నారు.
విజయవాడ:బెజవాడ సీపీ, సర్కిల్ ఇన్స్ పెక్టర్ గుణరామ్ కి డిప్యూటీ సీఎం పవన్ ఫోన్. జంగారెడ్డి గూడెం కి చెందిన విద్యార్దిని అదృశ్యం కేసు విచారణ గురించి ఫోన్ చేసిన పవన్.