ఏడు నెలల్లోపు అతను రెండు ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఓడిపోతాడని నేను అనుకోను అని గంగూలీ అన్నాడు. ఏడు నెలల్లో అతని కెప్టెన్సీలో రెండు ఫైనల్స్‌లో ఓడిపోతే, బార్బడోస్ సముద్రంలో ప్రయాణించినప్పుడు రోహిత్ శర్మ బహుశా సముద్రంలోకి దూకేస్తాడని సౌరవ్ గంగూలీ సరదాగా వ్యాఖ్యానించాడు.
మరికొన్ని గంటల్లోనే టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు భారత్, దక్షిణాఫ్రికా మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.