Swami Chaitanyananda Saraswati: న్యూఢిల్లీలోని ప్రముఖ విద్యా, ఆధ్యాత్మిక సంస్థలో లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనంగా మారాయి. వసంత్ కుంజ్ ప్రాంతంలోని శ్రీ శారదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్, తనను తాను ‘‘బాబా’’గా చెప్పుకుునే స్వామి చైతన్యానంద సరస్వతి లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ కేసుపై పోలీసులు విస్తృత దర్యాప్తును ప్రారంభించారు.
Padma Shri Garikapati Narasimha Rao: మహా సహస్రావధాని, ఆధ్యాత్మిక వేత్త, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. తెలుగు వాళ్లు ఎక్కడ ఉన్నా.. ఆయన అవధానాలు వినే ఉంటారు. వ్యక్తిత్వ వికాసంపై ఆయన ఇచ్చే సందేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా యువత గరికపాటి సందేశాలను బాగా ఇష్టపడతారు. ప్రస్తుత సమాజానికి తగ్గట్టు మాట్లాడటం, ఏదేని విషయాన్ని కుండ బద్ధుల గొట్టినట్లు వివరించడం యువతను కట్టి పడేస్తుంది.