దన్నుగా ధనమెంతో ఉన్నా మన్నువాసన తెలిసినవాడు కాబట్టి మట్టి మనుషుల పక్షాన నిలచి వారి కోసం గళమెత్తినవాడు దర్శకనిర్మాత,రచయిత,నటుడు బి.నరసింగరావు. బూజుపట్టిన నిజామురాజు పాలనలోనే భూస్వాములుగా ఉన్న నరసింగరావు పెద్దలు, మొదటి నుంచీ అణగారిన జనం బాగు కోసం పాటు పడ్డారు. తన చిత్రాలతో జనాన్ని మెప్పించడంలోనే కాదు, ప్రభుత్వ అవార్డులూ, రివార్డులూ పట్టేసి అలరించారు నరసింగరావు. మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్ లో 1946 డిసెంబర్ 26న నరసింగరావు జన్మించారు. ధనానికి కొదువలేని ఇంట్లో జన్మించడం వల్ల…