‘తండేల్’ సినిమా సక్సెస్ తర్వాత యువ సామ్రాట్ నాగ చైతన్య, ‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ దండుతో కలిసి ఒక మైథలాజికల్ థ్రిల్లర్ చేస్తున్నారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP (SVCC), సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, సుకుమార్ బి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి బాపినీడు సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘లాపతా లేడీస్’ సినిమా హీరో స్పర్ష్ శ్రీవాస్తవను తీసుకున్నారు . కిరణ్…