NC 24: నాగచైతన్య సినిమాలో విలన్‌గా బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా హీరో?
- నాగ చైతన్య కొత్త సినిమాలో విలన్‌గా 'లాపతా లేడీస్' హీరో స్పర్ష్ శ్రీవాస్తవ
- కార్తీక్ దండు దర్శకత్వంలో నాగ చైతన్య NC 24
- 'తండేల్' సక్సెస్ తర్వాత చైతన్య నటిస్తున్న మైథలాజికల్ థ్రిల్లర్‌పై భారీ అంచనాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘తండేల్’ సినిమా సక్సెస్ తర్వాత యువ సామ్రాట్ నాగ చైతన్య, ‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ దండుతో కలిసి ఒక మైథలాజికల్ థ్రిల్లర్ చేస్తున్నారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP (SVCC), సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, సుకుమార్ బి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి బాపినీడు సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘లాపతా లేడీస్’ సినిమా హీరో స్పర్ష్ శ్రీవాస్తవను తీసుకున్నారు . కిరణ్ రావు దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న స్పర్ష్ శ్రీవాస్తవ, ఇప్పుడు తొలిసారి తెలుగు సినిమాలో నటిస్తున్నారు. ఈ పాత్ర ఆయన కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయి అవుతుందని చిత్ర బృందం శ్రీవాస్తవకు బెస్ట్ విషెస్ తెలిపింది. ఈ సినిమాలో స్పర్శ్ విలన్ పాత్రలో నాగచైతన్యతో ఢీ కొట్టే పాత్రలో కనిపించబోతున్నాడు.
Also Read : Shilpa Shirodkar: మహేష్ బామ్మర్ది సినిమాతో మరదలి రీ ఎంట్రీ
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
ఇప్పటికే విడుదలైన “NC24 – The Excavation Begins” ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఈ గ్లింప్స్‌లో సినిమా స్కేలు, ఇంటెన్స్ మూడ్ అభిమానులను, సినీ ప్రియులను ఆకట్టుకుంది. #NC24 మిస్టరీ, ఎమోషన్, గ్రాండ్ విజువల్స్‌తో ఒక ప్రత్యేకమైన మైథికల్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. కార్తీక్ దండు ప్రత్యేకమైన కథాకథనం, SVCC – సుకుమార్ రైటింగ్స్ బలంగా మద్దతు ఇవ్వడం, నాగ చైతన్య కొత్త కోణంలో నటించడం, ఇప్పుడు స్పర్ష్ శ్రీవాస్తవ వంటి నటులు చేరడంతో, ఈ సినిమాపై అన్ని సినీ పరిశ్రమల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పౌరాణిక థ్రిల్లర్‌లకు కొత్త హద్దులను చూపించేలా ఒక ప్రపంచ స్థాయి సినిమా ఇవ్వడానికి చిత్ర బృందం రాజీ పడకుండా పనిచేస్తోంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ వచ్చే నెల హైదరాబాద్‌లో వేసిన ఒక భారీ సెట్‌లో ప్రారంభం కానుంది. సినిమా విశేషాలకు సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ త్వరలో రానున్నాయి.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!