జార్ఖండ్‌లోని దుమ్కాలో సామూహిక అత్యాచారానికి గురైన స్పానిష్ మహిళ మంచి మనసు చాటుకుంది. భారత ప్రజలపై తనకు ఎలాంటి ఫిర్యాదులు లేవని తెలిపింది. భారతదేశ ప్రజలు చాలా మంచి వారని స్పానిష్ పర్యాటకురాలు చెప్పారు. తాను నేరస్తులను తప్ప ఇక్కడి ప్రజలను నిందించను.. ఇక్కడి ప్రజలు తనను చాలా బాగా ఆదరించారని పేర్కొంది. వారు తన పట్ల దయతో ఉండటం వల్లనే.. భారత్ లో దాదాపు 20 వేల కిలోమీటర్లు సురక్షితంగా ప్రయాణించగలిగానని చెప్పింది. ఇదిలా ఉంటే..…
శుక్రవారం(మార్చి 1) జార్ఖండ్‌లోని దుమ్కాలో సామూహిక అత్యాచారానికి గురైన స్పానిష్ మహిళ భర్తకు జార్ఖండ్ పోలీసులు రూ.10 లక్షల పరిహారం అందజేశారు. అత్యాచారానికి గురైన స్పానిష్ పర్యాటకురాలికి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ రూ.10 లక్షల (11,126.20 యూరోలు) పరిహారం అందించింది. ఆమె ఖాతాకు డబ్బు బదిలీ అయింది. చెక్కు కాపీని, నగదు బదిలీకి సంబంధించిన లేఖను బాధితురాలి భర్తకు దుమ్కా డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు దొడ్డే, ఎస్పీ పీతాంబర్ సింగ్ ఖేర్వార్ అందించారు.