The Trail: ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరో సినిమాలు, చిన్న సినిమాలు అనే తేడా లేదు. కథ బావుంటే.. చిన్న సినిమాలు కూడా భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. ఇక ఎంతపెద్ద స్టార్లు ఉన్నా కూడా కథలేకపోతే ప్రేక్షకులు మెచ్చడం లేదు.
లేడీ ఓరియంటెడ్ థ్రిల్లర్ మూవీ 'ది ట్రయల్' టీజర్ విడుదలైంది. రామ్ గన్నీ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ సినిమా లో స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు ప్రధాన పాత్రలు పోషించారు.