25 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో స్పేస్ పాలసీ రూపొందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. దీని ద్వారా ప్రత్యక్షంగా 5 వేలు, పరోక్షంగా 30 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.. లేపాక్షి, తిరుపతిలో స్పేస్ సిటీల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తోంది ప్రభుత్వం.. 25 నుంచి 45 శాతం వరకు పెట్టుబడి రాయితీలు కూడా కల్పించనుంది.. విద్యార్ధులను భాగస్వాములు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.. ఆకర్షణీయంగా ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0 ఉండాలని ఆదేశించారు…