Israel–Hezbollah conflict: ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత రోజే ఉల్లంఘనకు పాల్పడింది. గురువారం ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దక్షిణ లెబనాన్‌పై దాడికి పాల్పడ్డాయి. రాకెట్ నిల్వ కేంద్రంలో హెజ్‌బొల్లా మిలిటెంట్లు క్రియాశీలకంగా ఉండటాన్ని గమనించే తాము దాడి చేసినట్లు టెల్ అవీవ్ పేర్కొనింది.
Hezbollah: అక్టోబర్ 7 తరహా దాడులు చేసేందుకు హెజ్‌బొల్లా సన్నాహాలు చేస్తుందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఐడీఎఫ్ ప్రతినిధి డానియల్ హగారీ మాట్లాడుతూ.. దక్షిణ లెబనాన్‌లోని గ్రామాల్లో ఇళ్లను వాడుకొని దాడులు చేసేందుకు సిద్ధమైందన్నాడు.
గత రెండు రోజులుగా లెబనాన్‌లో కమ్యూనికేషన్ పరికరాలు పేలుళ్లు హడలెత్తించాయి. ఆ ఘటనలో ఇప్పటి వరకు 37 మంది ప్రాణాలు కోల్పోయారు. 3000 మంది గాయపడ్డారు. ఈ పేలుళ్ల నుంచి ఇంకా తేరుకోకముందే తాజాగా దక్షణి లెబనాన్‌పై బాంబుల వర్షం కురిసింది. దీంతో మరోసారి లెబనాన్ వాసులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడినట్లుగా హిజ్బుల్లా చీఫ్ ప్రకటించారు.