విశాఖ కేంద్రంగా ఏర్పాటైన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కు అధికారికంగా కేంద్రం ఆమోదించడంతో పాటు రూట్ మ్యాప్ పిక్స్ చేసింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం జోన్ పరిధిలోకి తెస్తూనే కీలకమైన కేకే లైన్ ను తూర్పు కోస్తా పరిధిలో నూతనంగా ఏర్పాటైన రాయగడ డివిజన్ పరిధిలోకి మార్పు చేసింది. కొత్తవలస - కిరండోల్ భాగమైన అరకు రైల్వే స్టేషన్ పై తెలుగువారికి ఎంతో ఎమోషనల్ టచ్ ఉన్నది. అంతే కాదు కేకే లైన్ తూర్పు కోస్తా రైల్వే…