South Africa: దక్షిణాఫ్రికాలో ఒక ఉన్మాది రెచ్చిపోయాడు. ఆదివారం, జోహెన్నెస్‌బర్గ్ నగరం వెలుపల ఉన్న ఒక టౌన్‌షిప్‌లో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 10 మంది చనిపోయారు, మరో 10 మంది గాయపడినట్లు తెలుస్తోంది. సౌతాఫ్రికాలో నెల రోజుల కాలంలో జరిగిన రెండో సామూహిక కాల్పుల ఘటన ఇది.