అజయ్ దేవగన్, సుదీప్ మధ్య కొనసాగుతున్న జాతీయ భాషా వివాదంపై ప్రముఖ సింగర్ సోనూ నిగమ్ స్పందించారు. ఈ విషయమై సోనూ మాట్లాడుతూ ‘హిందీ మన జాతీయ భాష అని రాజ్యాంగంలో ఎక్కడా రాయలేదు. అది ఎక్కువగా మాట్లాడే భాష కావచ్చు. కానీ జాతీయ భాష కాదు. నిజానికి తమిళం చాలా పురాతన భాష. సంస్కృతం, తమిళం మధ్య ఈ విషయమై చర్చ జరుగుతోంది. అయితే ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన భాష తమిళం అంటున్నారు’ అని చెప్పాడు.…