మధ్యప్రదేశ్‌కు చెందిన కొత్త జంట రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీ గత నెల 23న మేఘాలయలో అదృశ్యమయ్యారు. మే 11న వివాహం చేసుకుని హనీమూన్ కోసం మే 20న మేఘాలయకు వచ్చారు. మూడు రోజుల తర్వాత తూర్పు ఖాసీ హిల్స్ కొండ ప్రాంతంలో అదృశ్యమయ్యారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లోని రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన రవాణా వ్యాపారవేత్త రాజా రఘువంశీ తన భార్య సోనమ్‌తో కలిసి తన హనీమూన్ జరుపుకోవడానికి మేఘాలయ రాష్ట్రం షిల్లాంగ్‌కు వెళ్లాడు. అక్కడ ఇద్దరూ అదృశ్యమయ్యారు. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీలైనంత త్వరగా వారిని కనుగొనాలని కోరారు.