రాజా రఘువంశీ-సోనమ్ చూడముచ్చటైన జంట. ఏ ఫొటోలు చూసినా.. ఏ వీడియో చూసినా చాలా చక్కగా.. చిలకగోరింకల్లా ఉన్నారు. ఇక ఇరు కుటుంబాలు కూడా ఆర్థికంగా బలమైన కుటుంబాలే.
దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. నిందితులకు జితేంద్ర రఘువంశీ యూపీఐ ఖాతా నుంచి నగదు బదిలీ అయింది. సోనమ్ రఘువంశీ.. జితేంద్ర రఘువంశీ ఖాతా నుంచి నగదు బదిలీ చేసినట్లుగా మేఘాలయ పోలీసులు గుర్తించారు.