Minister Narayana: వేస్ట్ టు ఎనర్జీ రంగాన్ని అభివృద్ధి పరచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలలో భాగంగా మంత్రి నారాయణ తాజాగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆధునిక ప్లాంట్లను సందర్శించారు. సోమవారం (జూన్ 9) రాత్రి ఆయన మహారాష్ట్రలోని పింప్రీ చించవాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (PCMC) వద్ద ఉన్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ను పరిశీలించారు. ఈ ప్లాంట్ ద్వారా ప్రతి రోజూ నగర చెత్తను ఆధారంగా చేసుకుని సుమారు 14 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.…