తెలంగాణలో రెండు జిల్లాల ప్రజల చిరకాల వాంఛ వంతెన నిర్మాణం కలగానే మిగిలిపోతుంది. గోదావరి పై బ్రిడ్జ్ నిర్మిస్తే ఆ రెండు జిల్లాల వాసులకు ప్రయాణ దూర భారం తగ్గడమే కాకుండా సులభతరం అవుతుందని భావించిన వారందరికి నిరాశే ఎదురవుతుంది. బ్రిడ్జ్ నిర్మాణం కోసం మట్టి పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో ఆనందాలు వెల్లివిరిసినా ఐదేళ్ళు అవుతున్నా వంతెన ఊసే లేదని స్థానికులు వాపోతున్నారు. జయశంకర్ భూపాలపల్లి- మంచిర్యాల జిల్లాల మధ్య గోదావరి నదిపై వంతెన నిర్మాణంతో రవాణా…