జంతువలకు ఏదైనా జరిగితే.. వాటిని ప్రేమించే వారు చూస్తూ ఊరుకోరు.. అయితే, తాజాగా, వీధికుక్కలతో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణతో ఒక మహిళ ఆగ్రాలో రెసిడెన్షియల్ సొసైటీ సెక్యూరిటీ గార్డును కొట్టి, అతనిపై దుర్భాషలాడారు.. ఆదివారం జరిగిన సంఘటన యొక్క వీడియో వైరల్‌గా మారడంతో ఆగ్రా పోలీసులు ఆ వీడియోను పరిశీలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. జంతు హక్కుల కార్యకర్తగా చెప్పుకునే 20 ఏళ్లకు పైగా ఉన్న ఓ మహిళ.. సెక్యూరిటీ గార్డును తిడుతూ.. కర్రతో దాడిచేసిన…