Nara Lokesh: టీడీపీ అనేది ఒక వ్యక్తికి పరిమితం కాని పార్టీ అని, కార్యకర్తలే నిజమైన అధినేతలని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పార్లమెంటరీ కమిటీలకు నిర్వహించిన శిక్షణ తరగతుల కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, పార్టీనే అందరికీ అధినాయకత్వం అని పేర్కొన్నారు. పార్టీలో యువతకు ఎక్కువ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని లోకేష్ అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు కూడా పొలిట్…