Sobhita Dhulipala: శోభితా ధూళిపాళ్ల.. అచ్చ తెలుగందం. అయితే తెలుగువారికి పరిచయమవ్వడానికే కొద్దిగా లేట్ అయ్యింది. మొదట బాలీవుడ్ లో అడుగుపెట్టి.. గూఢచారి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Sobhita Dhulipala: ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నది సామెత. కానీ.. తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ల మాత్రం రచ్చ గెలిచి ఇంట గెలవడానికి ప్రయత్నిస్తోంది. సాధారణంగా తెలుగు హీరోయిన్స్ ఎవరైనా ముందు టాలీవుడ్ లో సక్సెస్ అందుకున్నాక బాలీవుడ్ కు వెళ్లారు.. కానీ శోభిత మాత్రం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చింది.
ముంబై ఉగ్రదాడులలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా అడివి శేష్ హీరోగా ‘మేజర్’ చిత్రాన్ని తీసి విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు శశికిరణ్ తిక్కా. జూన్ 3న పాన్ ఇండియా మూవీగా విడుదలైన ‘మేజర్’ అన్ని చోట్లా సక్సెస్ సాధించటంతో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. తాజాగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన ఈ సినిమా హిందీ, తెలుగు వెర్షన్ లలో తొలి రెండు స్థానాల్లో నిలిచివారం రోజుల పాటు ట్రెండింగ్ లో…
ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల్లో.. 2016లో అమీర్ ఖాన్ నటించిన బాలీవుడ్ మూవీ ‘దంగల్’.. రెండు వేల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఇక దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2.. 1800 కోట్లకు పైగా రాబట్టి సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. 2017లో వచ్చిన బాహుబలి 2 తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటడమే కాదు.. పాన్ ఇండియా సినిమాలకు పునాదిగా నిలిచి.. ఇండియన్ సినిమాని…
గత కొన్ని రోజులుగా నాగ చైతన్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సమంతను ట్రోల్ చేస్తున్న విషయం తెలిసింది. నిజానికి నాగచైతన్య – సమంత విడిపోయిన తర్వాత కొద్దిరోజులు మౌనంగా ఉన్న ఇద్దరు స్టార్స్ ఫ్యాన్స్, పీఆర్ టీమ్ నేతృత్వంలో ఒకరిపై ఒకరు బురద చల్లడం మొదలెట్టారని తెలుస్తోంది. అయితే… సమంతపై ఎదురు దాడి చేస్తున్న చైతన్య అభిమానులను అడ్డుకోవడం కోసం అన్నట్టుగా ఆమె అభిమానులు ఇటీవల ఎదురుదాడి మొదలెట్టారు. నాగచైతన్య, శోభిత దూళిపాళతో డేటింగ్ చేస్తున్న…
అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. హీరోయిన్ సమంత తో విడాకులు తీసుకున్నాకా చై కెరీర్ మీద ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం చై చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇకపోతే చైతన్య రెండో పెళ్లి విషయమై గత కొన్ని రోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయి. నాగార్జున కొడుకుల భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నాడని, చై కు రెండో పెళ్లి చేసి ఒక ఇంటివాడిగా మార్చాలని ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో…
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘మేజర్’. జూన్ 3వ తేదీన రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమాను.. ఎన్నడు లేని విధంగా సరికొత్తగా ప్రమోట్ చేస్తున్నారు. దాంతో సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేయడంలో మేజర్ సక్సెస్ అయిందనే చెప్పాలి. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు అర్పించిన వీరజవాను మేజర్ ఉన్ని సందీప్ కృష్ణన్ జీవితం ఆధారంగా మేజర్ తెరకెక్కింది. దాంతో ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ను అందుకుంటుందా…
కరోనా అనంతరం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కొందరు నిర్మాతలు తమ చిత్రాల బడ్జెట్ ఎక్కువ అయ్యిందని టిక్కెట్ రేట్లు పెంచుకునే వెసులు బాటు కల్పించమని ప్రభుత్వాలను కోరారు. ఏపీ ప్రభుత్వం మొదట్లో టిక్కెట్ రేట్లను అమాంతంగా తగ్గించేసినా, ఆ తర్వాత బాగానే పెంచింది. ఇక భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతలు అడగడం ఆలస్యం వాటి టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి సై అనేసింది. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు తన తాజా చిత్రం ‘ఎఫ్ 3’ని…