ధూమపానం ఆరోగ్యానికి హానికరమని ఎంత చెప్పినా కొందరు మాత్రం అంత త్వరగా మానరు. అయితే.. ప్రస్తుతం యువత వాటికి బానిసలుగా మారుతున్నారు. టీతో పాటు ఓ సిగరెట్ తాగుతూ.. ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఓ అధ్యయనం వారికి కీలక విషయాన్ని తెలిపింది. ప్రముఖ యురాలజిస్ట్ మార్క్ లానియాడో ‘మిర్రర్’ గతంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. ధూమపానం వల్ల పురుషాంగం కుచించుకుపోవడమే కాకుండా అంగస్తంభన సమస్యలు కూడా తలెత్తుతాయని పేర్కొన్నారు.