Smartwatch: ఇటీవల కాలంలో స్మార్ట్‌వాచ్‌లు మనుషులు ప్రాణాలు కాపాడుతుున్నాయి. గుండెపోటు, బీపీ ఎక్కువ కావడం వంటి వాటిని ముందే గమనించి, అలర్ట్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే విమానంలో ఓ మహిళ ప్రాణాలను స్మార్ట్ వాచ్ కాపాడింది.
Smartwatch Saves Life: టెక్నాలజీని సరైన విధంగా ఉపయోగిస్తే మానవాళికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. మరోవైపు సక్రమంగా వినియోగించకుంటే ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది. అయితే టెక్నాలజీ ఓ వ్యక్తి ప్రాణాలను నిలబెట్టింది. గుండె పోటుతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని స్మార్ట్‌వాచ్ కాపాడిన ఘటన యూకేలో జరిగింది.