టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ అప్పట్లో శ్రీశాంత్ చెంప ఛెళ్లుమనిపించిన సంఘటన గుర్తుందా? ఐపీఎల్ ప్రారంభ సీజన్‌లో సీనియర్స్ పట్ల అమర్యాదగా ప్రవర్తించాడన్న నెపంతో.. కోపాద్రిక్తుడైన హర్భజన్ లాగి ఒక్కటిచ్చాడు. ఆరోజుల్లో ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనకు ‘స్లాప్ గేట్’ అనే ముద్ర కూడా పడింది. అప్పట్లో ఈ ఉదంతంపై హర్భజన్ పెద్దగా నోరు విప్పింది లేదు. అయితే, ఇన్నాళ్ల తర్వాత ఆ ఘటనని గుర్తు చేసుకుంటూ ‘తాను చేసింది ముమ్మాటికీ తప్పే’నని…