17 ఓవర్లు ముగిసిపోయాయి.. శ్రీలంక స్కోరు 118/6.. మ్యాచ్ గెలవాలంటే 3 ఓవర్లలో 59 పరుగులు చేయాలి.. ఇది దాదాపు అసాధ్యమైన ఫీట్.. కాబట్టి శ్రీలంక ఈ మ్యాచ్ ఓడిపోవడం ఖాయమని అంతా అనుకున్నారు. శ్రీలంక అభిమానులు సైతం మెల్లగా మైదానాన్ని వదిలి వెళ్తున్నారు. అప్పుడు శ్రీలంక కెప్టెన్ దసున్ షనక (25 బంతుల్లో 54) తాండవం చేశాడు. ఆసీస్ బౌలర్లపై మెరుపు దాడికి దిగాడు. వచ్చిన ప్రతి బంతిని బౌండరీ దిశగా బాదాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ…